Breaking News

ఈసారి ఎండలు ఎక్కువే!

Published on Tue, 04/01/2025 - 05:36

న్యూఢిల్లీ: ఈసారి ఎండల భగభగ తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఎండలు సాధారణానికి మించిన తీవ్రతతో ఉండొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతం మైదాన ప్రాంతాల్లో వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశముందని కూడా అంచనా వేసింది. 

తూర్పు, పశ్చిమ భారతం మినహా దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఈసారి సాధారణ గరిష్ట స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. తూర్పు, పశ్చిమ భారత్‌లో సాధారణ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయంది. అత్యధిక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగతలు సైతం సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశముందని ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ మహాపాత్ర సోమవారం వర్చువల్‌ మీడియా సమావేశంలో వివరించారు. 

‘ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉత్తర, తూర్పు, మధ్య భారతదేశం, వాయవ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు అధికంగానే వడగాడ్పులు వీచే అవకాశముంది. మామూలుగా, ఈ కాలంలో నాలుగు నుంచి ఏడు రోజులు మాత్రమే వడగాడ్పులు వీస్తుంటాయి’అని ఆయన తెలిపారు. వడగాడ్పుల తీవ్రత తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో రాజస్తాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు కర్ణాటక తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ పేర్కొంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)