Breaking News

ఢిల్లీకి రెడ్‌ అలర్ట్‌.. పలు విమాన సర్వీసులు రద్దు

Published on Sat, 08/09/2025 - 07:33

ఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాదిలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పండుగ వేళ నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఢిల్లీలో శనివారం పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 90 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో నాలుగు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపారు.

శుక్రవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఢిల్లీలోని అండర్‌ పాసుల్లోకి వర్షపు నీరు చేరుకుంది. పలు లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరుకుంది. ఇక, ఢిల్లీలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్‌, ఎల్లో అలర్ట్‌ విధించింది. అలాగే, హర్యానాకు ఆరెంజ్‌ అలర్ట్‌, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు