Breaking News

ఉత్తమ వర్సిటీగా ఐఐఎస్‌సీ

Published on Fri, 09/05/2025 - 06:19

సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) 2025లో ఓవరాల్‌ విభాగంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మద్రాస్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) బెంగళూరు ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. 

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ పదో ఎడిషన్‌ ర్యాంకింగ్స్‌ను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం ప్రకటించారు. ఐఐటీ మద్రాస్‌ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఏడోసారి. ఉత్తమ వర్సిటీగా బెంగళూరు ఐఐఎస్‌సీ నిలవడం వరుసగా ఇది పదో సంవత్సరం. 

ఓవరాల్‌ విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా.. తరువాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీలు నిలిచాయి. ఉత్తమ వర్సిటీల్లో రెండో స్థానాన్ని జేఎన్‌యూ, మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి మూడు స్థానాల్లో కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్‌ వర్సిటీ నిలిచింది. గతేడాది మూడో స్థానంలో నిలిచి జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఒక స్థానం పడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. 

ఇంజనీరింగ్‌ కళాశాలల జాబితాలో తొమ్మిది ఐఐటీలు టాప్‌ టెన్‌లో నిలిచాయి. ఈ విభాగంలో ఐఐటీ మద్రాస్‌ వరుసగా పదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబేలు రెండు, మూడు స్థానాలను నిలుపుకొన్నాయి. టాప్‌ టెన్‌ జాబితాలో నిలిచిన ఏకైక నాన్‌ ఐఐటీ తిరుచిరాపల్లిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఐఐఎం అçహ్మదాబాద్‌ తన అగ్రస్థానాన్ని నిలుపుకొంది. 

ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజీకోడ్‌ తరువాతి స్తానాలను దక్కించుకున్నాయి. టాప్‌ 10 బీ స్కూల్స్‌లో ఏడు ఐఐఎంలు నిలవగా.. ఏకైక టెక్‌ సంస్థ ఐటీ ఢిల్లీ ఈ విభాగంలో చోటు దక్కించుకుంది. వైద్య కళాశాలల్లో న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పరిశోధనా సంస్థల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు అగ్రస్థానంలో, ఐఐటీ మద్రాస్‌ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఓపెన్‌ విశ్వవిద్యాలయాల్లో ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌యూనివర్సిటీ(ఇగ్నో) మొదటి స్థానంలో, కర్ణాటక స్టేట్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మైసూరు రెండో స్థానంలో నిలిచాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ పదో ఎడిషన్‌ తొమ్మిది విభాగాల్లో ర్యాంకులిచ్చింది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)