Breaking News

రామ్‌జెట్‌తో సూపర్‌ బుల్లెట్‌

Published on Tue, 01/13/2026 - 05:46

సాక్షి, చెన్నై: దేశీయ రక్షణ పరిశోధనలో ఐఐటీ మద్రాస్‌ మ­రో కీలక ముందడుగు వే­సిం­ది. తుపాకుల కాల్పుల ప­రిధిని సుమారు 50% వర­కు పెంచే రామ్‌ జెట్‌ సాంకేతికతతో కూడిన ఆరి్టలరీ గోళీలను ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ కొత్త గోళీలతో ఆయుధ ఘాతుక శక్తి ఏమాత్రం తగ్గకుండా ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను సోమవారం ఐఐటీ మద్రాస్‌ ప్రకటించింది. 155 ఎంఎం ఆర్టిలరీ గోళీలో సంప్రదాయ బేస్‌–బ్లీడ్‌ యూనిట్‌ స్థానంలో రామ్‌జెట్‌ ఇంజి న్ ను అమర్చడం ఈ పరిశోధన ప్రత్యేకతగా పేర్కొన్నారు. తుపాకీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ గోళీకి నిరంతర త్రస్ట్‌ లభించడంతో కాల్పుల పరిధి గణనీయంగా పెరుగుతోందని వివరించారు. 

తుపాకుల పరిధి ఇలా.. 
బోఫోర్స్, యూఎల్‌హెచ్‌ 24 కి.మీ నుంచి 43 కి.మీ, ధనుష్‌ 30 కి.మీ నుంచి 55 కి.­మీ, వజ్ర 36 కి.మీ నుంచి 62 కి.మీ, ఆటాగ్స్‌ 40 కి.మీ నుంచి 70 కి.మీ దూరంగా ఉ­న్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలుంటుందని పరిశోధన బృందంలోని ఐఐటీ మ­ద్రాస్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ పీఏ రామకృష్ణ తెలిపారు. ఈ సాంకేతికత అమలులోకి వస్తే కొత్త తుపాకులు లేదా ఖరీదైన క్షిపణుల అవసరం లేకుండానే భారతీయ ఆరి్టలరీ దళాలకు ఎక్కువ దూరం దాడి చేసే సామర్థ్యం లభిస్తుందని వివరించారు. ఇది ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా మరో ముందడుగు అని చెప్పారు. 

విజయవంతమైన పరీక్షలు 
భారత సైన్యంతో కలిసి 2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ పలు దశల పరీక్షలను పూర్తిచేసింది. 2025 సెప్టెంబర్‌లో డియోలాలి ఆరి్టలరీ పాఠశాలలో, డిసెంబర్‌లో పోఖ్రాన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో నిర్వహించిన ప్రయోగాల్లో గోళీ సాఫీగా తుపాకీ నుంచి బయటకురావడం, స్థిరంగా ప్రయాణించడం, రామ్‌జెట్‌ ఇగి్నషన్‌ పరీక్షలు విజయవంతమైనట్లు ప్రకటించారు. దేశీయ పరిశోధనతో ఉన్న ఆయుధ వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేయవచ్చని ఈ ప్రాజెక్ట్‌ నిరూపించిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారన్నారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)