Breaking News

గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిన ఐఐటీ ప్రొఫెసర్

Published on Sun, 12/24/2023 - 10:08

లక్నో: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ వేదికపైనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. 

ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి వ్యవహారాల డీన్‌గా, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతిగా ఉన్న సమీర్‌ ఖండేకర్‌(53)ని ఆహ్వానించారు. ఈ వేడుకలో ప్రసంగించే క్రమంలోనే ఆయన వేదికపై కుప్పకూలారని ఇన్‌స్టిట్యూట్ అధికారులు తెలిపారు. 

 అత్యుత్తమ పరిశోధకుడిగా పేరుగాంచిన సమీర్ ఖండేకర్ ఆకస్మిక మరణం పట్ల ఐఐటి కాన్పూర్ మాజీ డైరెక్టర్ అభయ్ కరాండికర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖండేకర్‌కు ఐదు సంవత్సరాల క్రితం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఒక ప్రొఫెసర్ చెప్పారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనే ఆయన మృతదేహాన్ని ఉంచినట్లు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఖండేకర్ ఏకైక కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 

ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు