Breaking News

‘కీలక ఖనిజాల’పై పరిశోధనలకు మరింత ఊపు

Published on Sun, 10/26/2025 - 06:46

సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్‌ అవసరాలకు అత్యంత ముఖ్యమైన ‘కీలక ఖనిజాల’రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసేందుకు కేంద్ర గనుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ (ఎన్సీఎంఎం) కింద మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలకు ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’(సీఓఈ) హోదాను కల్పించింది. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సీ–మెట్‌), బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) చేరాయి. దీంతో ఈ హోదా పొందిన మొత్తం సంస్థల సంఖ్య 9కి పెరిగింది. 

ఇటీవల కేంద్ర గనుల శాఖ కార్యదర్శి పియూష్‌ గోయల్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్‌ అభయ్‌ కరందీకర్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ అండ్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. గుర్తింపు పొందిన ఈ సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయి. ఒక్కో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఒక కన్సార్టియంగా పనిచేస్తుంది. ఇందులో కనీసం ఇద్దరు పరిశ్రమ భాగస్వాములను, ఇద్దరు ఆర్‌అండ్‌డీ/విద్యాసంస్థల భాగస్వాములు ఉంటారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీల్లో జరిగే పరిశోధనల్లో కనీసం 90 పరిశ్రమలు, విద్యా/పరిశోధన సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని గనుల శాఖ తెలిపింది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)