Breaking News

నేను రాజ్యాంగానికి సేవకుడిని

Published on Sat, 12/09/2023 - 05:08

న్యూఢిల్లీ/ముంబై: రాజ్యాంగానికి, చట్టానికి తానో సేవకుడినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. నిర్దేశించిన స్థానాన్ని అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. సీజేఐ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించగానే, మాథ్యూస్‌ జె.నెడుంపర అనే న్యాయవాది ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ..సీనియర్‌ న్యాయవాది హోదా విధానాన్ని రద్దు చేయడంతోపాటు కొలీజియం వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

దీనిపై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ..‘మనస్సులో ఉన్న విషయం చెప్పే స్వేచ్ఛ మీకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా, నేను చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడిని. నాకు నిర్దేశించిన స్థానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అంతేతప్ప, నాకు నచ్చింది కాబట్టి, ఇది నేను చేస్తాను అని చెప్పలేను’అని పేర్కొన్నారు.

లాయర్లకు సీనియర్‌ హోదా ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ నెడుంపర మరో ఏడుగురు వేసిన పిటిషన్‌పై అక్టోబర్‌లో విచారణ చేపట్టిన అప్పటి సుప్రీంకోర్టు బెంచ్‌.. సీనియర్‌ న్యాయవాది హోదాను ప్రతిభకు గుర్తింపుగా పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అదేవిధంగా, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌(సీఏటీ) ముంబై ధర్మాసనం కొత్త కార్యాలయాన్ని శుక్రవారం సీజేఐ ప్రారంభించారు. న్యాయమూర్తుల నియామకంపై అంతిమ నియంత్రణ ఎవరిదనే అంశంపై నిత్యం తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జడ్జీల పోస్టుల ఖాళీలు పెరుగుతుండగా, నియామకాలుపెండింగ్‌లో ఉంటున్నాయని  చెప్పారు. కోర్టుల్లో జాప్యాలను నివారించి, సకాలంలో న్యాయం అందించే విషయంలో ట్రిబ్యునళ్లు కీలకంగా మారాయన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)