Breaking News

నింగి నుంచి ఊడిపడ్డ భారీ యంత్రం..ఉలిక్కిపడ్డ గ్రామస్తులు

Published on Sat, 01/18/2025 - 15:34

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బీదర్‌(Bidar)లోని జల్సంగి గ్రామ వాసులకు శనివారం(జనవరి 18) ఓ వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని ఓ ఇంటిపై ఆకాశం  నుంచి ఒక్కసారిగా పెద్ద బెలూన్‌(Baloon) పడింది. బెలూన్‌కు పెద్ద పేలోడ్‌ యంత్రం కూడా ఉండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి తోడు బెలూన్‌కు అమర్చి ఉన్న యంత్రానికి రెడ్‌ లైట్‌ వెలుగుతూ ఉండడంతో గ్రామస్తులకు భయం ఎక్కువైంది. 

వెంటనే బెలూన్‌తో పాటు భారీ యంత్రమొకటి ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు జల్సంగి గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే హొమ్నాబాద్‌ తాలూకా పోలీసులు స్పాట్‌కు చేరుకుని బెలూన్‌ను దానికి ఉన్న యంత్రాన్ని పరిశీలించారు. దానిపై ఉన్న ఒక లేఖ ఆధారంగా ఆ బెలూన్‌ యంత్రం టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(Tifr)కు చెందినదని పోలీసులు తేల్చారు. 

విషయం​ క్లారిటీ రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని తమ కేంద్రం నుంచి టీఐఎఫ్‌ఆర్‌ ఆకాశంలోకి బెలూన్‌ యంత్రాలను వదిలి వాతావరణంపై పరిశోధనలు చేస్తుంటుంది. హొమ్నాబాద్‌ పోలీసులు బెలూన్‌ గురించి సమాచారమివ్వడంతో టీఐఎఫ్‌ఆర్‌ బృందం అక్కడికి బయలుదేరి వెళ్లింది. బెలూన్‌ యంత్రం నింగిలో నుంచి ఊడిపడిన విషయాన్ని సోషల్‌మీడియాలో పలువురు నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. 


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)