Breaking News

ఐ-టిక్కెట్‌, ఈ- టిక్కెట్‌.. ఏది వెంటనే కన్ఫర్మ్‌ అవుతుంది?.. ముందుగానే తెలిస్తే..

Published on Thu, 06/22/2023 - 13:05

రైళ్లలో ఎక్కువగా ప్రయాణాలు సాగించేవారు కన్ఫర్మ్‌ టిక్కెట్‌ ఒక టాస్క్‌ లాంటిదని చెబుతుంటారు. కాగా కన్ఫర్మ్‌ టిక్కెట్‌ విషయంలో రకరకాల సమాచారాలు ఇంటర్నెట్‌లో కనిపిస్తుంటాయి.చాలామంది ఈ-టిక్కెట్‌, ఐ-టిక్కెట్‌లను బుక్‌ చేయడంలో చాలా తేడాలు ఉంటాయని, కన్ఫర్మ్‌ టిక్కెట్‌ లభించడం అంత సులభం కాదని అంటుంటారు.

దీనిపై క్లారిటీ రావాలంటే ముందుగా ఐ-టిక్కెట్‌, ఈ -టిక్కెట్‌ అంటే ఏమిటో తెలుసుకోవాల్సివుంటుంది. ఐఆరర్‌సీటీసీ వెబ్‌సైట్‌ నుంచి టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే దానిని ఈ- టిక్కెట్‌ అంటారు. దీనికి ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రింటెడ్‌ టిక్కెట్‌ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. 

ఇక ఐ-టిక్కెట్‌ విషయానికొస్తే దీనిని ప్రింట్‌ తీసుకోవడం చాలా కష్టం. ఈ టిక్కెట్‌ కూడా ఐఆర్‌సీటీసీ నుంచే బుక్‌ చేయాలి. ఈ తరహా టిక్కెట్‌ ప్రింటెడ్‌ కాపీ రైల్వే నుంచి ఇంటికి వస్తుంది. దీనికి ఛార్జీలు వేరుగా ఉంటాయి. ఈ విధమైన టిక్కెట్‌ను ప్రయాణం చేయాడానికి కొన్నిరోజుల ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

టిక్కెట్‌ బుకింగ్‌ విషయంలో చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ-టిక్కెట్‌, ఐ- టిక్కెట్‌లలో ఏది త్వరగా కన్ఫర్మ్‌ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. కొందరు ఐ-టిక్కెట్‌ త్వరగా కన్ఫర్మ్‌ అవుతుందని అంటారు. అయితే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఐ-టిక్కెట్‌, ఈ-టిక్కెట్‌ల కారణంగా వెయిటింగ్‌ లిస్ట్‌ క్లియర్‌ అవుతుందనడానికి ఏమీ సంభంధం లేదు. ‘ఫస్ట్‌ కమ్‌.. ఫస్ట్‌ సర్వ్‌’ ఆధారంగా టిక్కెట్‌ బుక్‌ అవుతుంది. అంటే ఎవరు ముందుగా టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటారో వారికే ముందుగా సీట్లు కేటాయిస్తారని అర్థం. 

రైలు టిక్కెట్ల బుకింగ్‌ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే కన్ఫర్మ్‌ టిక్కెట్‌ వస్తుందనే ఆశతో ఐ- టిక్కెట్‌ లేదా ఈ-టిక్కెట్‌ తీసుకోవడంలో అర్థం లేదు. జనరల్‌ వెయిటింగ్‌, పీక్యూడబ్ల్యుఎల్‌, ఆర్‌క్యూడబ్ల్యుఎల్‌ల ఆధారంగా టిక్కెట్‌ కన్ఫర్మ్‌ అవుతుంది. జనరల్‌ వెయింటింగ్‌ టిక్కెట్‌ త్వరగా కన్పర్మ్‌ అవుతుంది. మిగిలినవి వెయిటింగ్‌ లిస్టు కోటాలో మిగిలిన సీట్ల ఆధారంగా ఈ సీట్లు అలాట్‌ అవుతాయి.

ఈ-టిక్కెట్‌ వలన ప్రయోజనం ఏమిటి?
ఈ- టిక్కెట్‌ తీసుకోవడం వలన ప్రయోజనం ఏమిటంటే.. ఒకవేళ మీకు ఈ- టిక్కెట్‌ కన్ఫర్మ్‌ కాకపోతే మీరు ట్రైన్‌లో జర్నీ చేయలేరు. అయితే ఐ-టిక్కెట్‌ కన్ఫర్మ్‌ కాని పక్షంలో.. రైల్వేవిభాగం నుంచి వచ్చిన అధికారిక టిక్కెట్‌ ద్వారా మీరు ప్రయాణం సాగించవచ్చు. ఈ- టిక్కెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద బుక్‌ చేసుకున్న టిక్కెట్‌ మాదిరి గుర్తింపును కలిగివుంటుంది.

ఇది కూడా చదవండి: మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా ఎందుకు గడ్డకట్టదంటే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)