Breaking News

మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ ఖాతాకు లింక్ చేశారో తెలుసుకోండిలా?

Published on Fri, 06/04/2021 - 15:37

భారతదేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్‌, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. కొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఎవరి ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ చేయలేదో వెంటనే లింక్ చేసుకోవాలని ఖాతాదారులను ఎస్‌బీఐ కోరింది. ఈ కరోనా మహమ్మరి సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కొత్త సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది.  

తాజాగా మరో కొత్త సర్విస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సర్విస్ ప్రకారం పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ(https://uidai.gov.in/) వెబ్‌సైట్ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు.

ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ స్టేటస్:

  • ముందుగా యూఐడిఏఐ https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • తర్వాత హోమ్ పేజీలో 'ఆధార్ సర్వీసెస్' పైన క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీకు కనిపించే "ఆధార్ లింకింగ్ స్టేటస్" పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
  • ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి "సెండ్ ఓటీపీ" పైన క్లిక్ చేయాలి.
  • ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
  • మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి "సబ్మిట్" పైన క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.

అందులో మీరు ఎప్పుడు బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేశారో చూపించడంతో పాటు బ్యాంక్ లింకింగ్ స్టేటస్ యాక్టీవ్‌గా ఉందో లేదో కూడా తెలుస్తుంది. మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలుసుకోవడానికి కచ్చితంగా మీ ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ వివరాలు తెలుసుకోలేము.

చదవండి: టెలికాం రంగంలోకి పెట్టుబడుల జోరు

#

Tags : 1

Videos

PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను

YSRCP మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశం

పాక్ కు కోలుకోలేని దెబ్బ, బలోచిస్తాన్‌కు భారత్ సపోర్ట్ ?

Ambati: అర్ధరాత్రి ఒక మహిళపై పోలీసులే దాడి.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?

YS Jagan: వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం

మురళీ ఎక్కడ ఉన్నావ్.. జగన్ సార్ వచ్చాడు సెల్యూట్ చెయ్

మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం..

Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

శ్రీకాకుళం జిల్లా కొరాఠి ఫీల్డ్ అసిస్టెంట్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు

Photos

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)