Breaking News

అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు..!

Published on Sun, 01/21/2024 - 12:57

లక్నో: రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22(సోమవారం)న జరగనుంది. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి తీసిన రామ మందిర దృశ్యాలను ఇస్రో పంచుకుంది. ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)ఈ దృశ్యాలను తీసింది. డిసెంబర్ 16, 2023న నిర్మాణంలో ఉన్న ఆలయం ఫొటోలు తీసింది. 

ఉపగ్రహ చిత్రాలలో నూతనంగా అభివృద్ధి చేసిన దశరథ్ మహల్, సరయు నది కూడా రామమందిరం సమీపంలో చూడవచ్చు.

కొత్తగా పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను NRSC షేర్ చేసిన చిత్రాలలో కూడా చూడవచ్చు. 

ఆలయ మొదటి దశ పూర్తి కావొస్తోంది. జనవరి 22న బాలరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశంలో ప్రముఖులతో కలిపి మొత్తం 7000 మందికి ఆహ్వానాలు అందాయి.   

సాంప్రదాయ నగారా శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. 

ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..!

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)