పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి..!

Published on Fri, 03/14/2025 - 08:20

కర్ణాటక: జిల్లాలో హనీ ట్రాప్‌ ఆరోపణలు గుప్పుమన్నాయి. గుబ్బి పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షుడు జీఎన్‌ అన్నప్పస్వామి ఈ మేరకు ఓ యువతిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం అన్నప్పస్వామికి ఇటీవల ఫేస్‌బుక్‌లో నిషా అనే యువతి పరిచయమైంది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. 

అమ్మాయి ఆహ్వానం మేరకు హాసన్, తిపటూరు, దొడ్డబళ్ళాపుర, నెలమంగల ఇలా అనేకచోట్ల కలిశారు. ఆపై యువతి నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగింది. దీనికి తిరస్కరించడంతో నిషా, ఆమె స్నేహితులతో కలిసి బెదిరింపులకు పాల్పడింది. మనం కలిసి ఉన్న నగ్నచిత్రాలను వైరల్‌ చేస్తానని హెచ్చరించింది. తనను హనీ ట్రాప్‌ చేసి రూ. 20 లక్షల డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందని అన్నప్పస్వామి చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

#

Tags : 1

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)