ఇంటి వద్ద ఓటింగ్‌ నేటి నుంచే..

Published on Fri, 04/05/2024 - 10:39

జైపూర్‌: రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్‌ 5) నుంచి ప్రారంభమవుతోంది. పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ఏప్రిల్‌ 19న జరగనుండగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహించనున్నారు.

రాజస్థాన్‌ రాష్ట్రంలో 58,000 మందికి పైగా ఓటర్లు ఇంటి వద్ద ఓటింగ్‌ను ఎంచుకున్నారని, వీరిలో 35,542 మంది మొదటి దశ లోక్‌సభ ఎన్నికల కోసం నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా ఇటీవల తెలిపారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. 

రాజస్థాన్‌లో మొదటి దశ లోక్‌సభ ఎన్నికల కోసం నమోదైన 35,542 మంది ఓటర్లలో 26,371 మంది సీనియర్ సిటిజన్లు ఉండగా 9,171 మంది దివ్యాంగులు ఉన్నారు. "ఇప్పటి వరకు, 58,000 మంది అర్హతగల ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. వీరిలో 43,638 మంది సీనియర్ సిటిజన్లు, 14,385 మంది దివ్యాంగులు ఉన్నారు" అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీలలో పోలింగ్ జరుగుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)