Breaking News

New Year 2025: మనీ ఆర్డర్‌ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు

Published on Wed, 01/01/2025 - 09:36

‘ట్రింగ్‌.. ట్రింగ్‌ ’ అని బెల్‌ మోగిస్తూ ఒక పోస్ట్‌మ్యాన్ ఆ కుగ్రామంలోనికి సైకిల్‌ మీద వచ్చాడు. ఒక ఇంటి ముందు ఆగిన ఆయన.. ‘కమలా.. పట్నం నుంచి నీ భర్త మనీ ఆర్డర్‌ పంపించాడు’ అని పెద్దగా చెప్పాడు. వెంటనే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి.. ‘సారూ మా ఆయన ఎంత పంపించాడు?’ అని అడిగింది. దీనికి ఆయన 250 రూపాయలు అని చెబుతూ, ఆ మెత్తాన్ని ఆమె చేతిలో పెట్టి, తన దగ్గరున్న రిజిస్ట్రర్‌లో ఆమె చేత వేలిముద్ర వేయించుకున్నాడు’

ఇది ఒకప్పటి కథ. నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. పాత సినిమాల్లోనూ ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. నాడు పట్టణంలో ఉద్యోగం చేసే భర్త ప్రతినెలా పంపే డబ్బు కోసం భార్య ఎదురు చూసేది. ‘మనీ ఆర్టర్‌’ తీసుకుని పోస్ట్‌మ్యాన్‌ ఎప్పడు వస్తాడా అని మహిళలు ఇళ్ల ముందు కాపలా కాసేవారు.

నేటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చిచేరింది. డబ్బుతో లావాదేవీలు చేసేందుకు ఈ-బ్యాంకింగ్‌తో పాటు, పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే మొదలైన యాప్‌లు మన మొబైల్‌లో అందుబాటులో ఉంటున్నాయి. నేడు మనం ఈ యాప్‌ల సాయంతో ప్రపంచంలోని ఏ మూలకైనా ఇన్‌స్టంట్‌గా డబ్బును పంపవచ్చు. అయితే మునుపటి కాలంలో డబ్బును పంపేందుకు మనీఆర్డర్‌ ఆధారంగా ఉండేది.

ఉత్తరాల బట్వాడా కోసం భారత ప్రభుత్వం 1854లో పోస్టల్ శాఖను నెలకొల్పింది. ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత పోస్టల్ డిపార్ట్‌మెంట్ 1880, జనవరి ఒకటిన మనీ ఆర్డర్(Money order) సేవలను ప్రారంభించింది. దీని ద్వారా  ఎవరైనా సరే తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు జమ చేసి, వారు పంపించాలనుకుంటున్న చోటుకు నగదును పంపించవచ్చు. ఆ నగదు చేరాల్సిన పోస్టాఫీసు రాగానే, అక్కడి పోస్ట్‌మ్యాన్స్‌ సంబంధిత చిరునామాకు ఆ మొత్తాన్ని అందజేసేవాడు. నాటి కాలంలో పోస్టల్‌శాఖలో ఇదొక విప్లవం అని చెబుతుంటారు.

మనీ ఆర్డర్‌ ద్వారా ఉత్తరాల మాదిరిగానే డబ్బును కూడా పంపగలగడం  నాటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా అనిపించింది. ఉపాధి కోసం నగరాల్లో ఉన్నవారికి.. గ్రామాల్లో ఉంటున్న వారి సంబంధీకులకు ఇదొక వారధిలా మారింది. అంతకుముందు వరకూ ఇతరులకు డబ్బు పంపడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. అయితే మనీ ఆర్డర్‌ రాకతో ఈ సమస్యకు చెక్‌ పడింది. తొలినాళ్లలో పెళ్లి వేడుకలకు వెళ్లే అవకాశం లేనివారు నూతన దంపతులకు కానుకల రూపంలో మనీ ఆర్డర్‌ ద్వారా డబ్బును పంపేవారట.

పోస్టల్‌శాఖ(Postal Department)లో మనీ ఆర్డర్ సేవ దశాబ్దాల కాలం పాటు సాగింది. ప్రజల నుంచి ఎంతో ఆదరణను కూడా పొంది​​ంది. అయితే కాలానుగుణంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఇన్‌స్టంట్ పేమెంట్ యాప్‌లు రావడంతో మనీ ఆర్డర్‌కు ప్రాధాన్యత తగ్గింది. ఈ పరిణామాల దరిమిలా 2015లో ఇండియన్ పోస్ట్ మనీ ఆర్డర్‌ సేవలను నిలిపివేసింది. అయితే ఆ తరువాత పోస్టల్‌ శాఖ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ (ఈఎంఓ), ఇన్‌స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ)సేవలను ప్రారంభించింది. త్వరిత గతిన డబ్బును అందించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఇన్‌స్టంట్ మనీ ఆర్డర్ సర్వీస్ కింద రూ.1,000 నుండి రూ.50,000 వరకు నగదు బదిలీ చేసే సదుపాయం ఉంది. ఐఎంవో సదుపాయం కలిగిన ఏదైనా పోస్టాఫీసు నుండి, ఒక గుర్తింపు రుజువుతో పాటుగా ఇ-ఫారమ్‌ను పూరించి, ఇంటర్నెట్ ఆధారిత తక్షణ సేవ ద్వారా డబ్బును పంపవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట పోస్టాఫీసుల నుండి మాత్రమే డబ్బును పంపేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్లినప్పటికీ, గతానికి సంబంధించిన అనేక విషయాలు మన మదిలో జ్ఞాపకాలుగా తారాడుతుంటాయి. మన ఇంట్లోని పెద్దలను అడిగితే, మనీ ఆర్డర్‌కు సంబంధించి వారికున్న అనుభవాలను చెబుతారు. 

ఇది కూడా చదవండి: ‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో..

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు