Breaking News

ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు

Published on Fri, 10/20/2023 - 06:07

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్‌ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్‌ సంతకం చేసిన అఫిడవిట్‌ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది.

అఫిడవిట్‌లోని అంశాలు...
► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్‌ లాగిన్‌ ఐడీ వివరాలను తీసుకున్నాను
► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్‌ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్‌చేశారు.
► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్‌ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు.  
► పార్లమెంట్‌లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్‌ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్‌లోడ్‌ చేసేవాడిని.
► ఆమెకు రాహుల్‌ గాం«దీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా.
► ఫైనాన్షియల్‌ టైమ్స్, న్యూయార్క్‌ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు
► సుచేతా దలాల్, శార్దూల్‌ ష్రాఫ్‌లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేíÙంచిప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్‌ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)