Breaking News

‘చరిత్ర తెలియకపోతే మాట్లాడొద్దు.. అస్సాం సీఎం ఫైర్‌’

Published on Sat, 12/09/2023 - 16:26

గౌహాతి: అస్సాంకు సంబంధించి సీనియర్‌ నాయ్యవాది కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. అస్సాం రాష్ట్ర చరిత్ర గురించి తెలియకపోతే అసలు మాట్లాడొద్దని మండిపడ్డారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదిస్తూ.. అస్సాంకు సంబంధించి కపిల్‌ సిబల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అస్సాం రాష్ట్రం.. మయన్మార్‌(బర్మా)లో భాగంగా ఉండేదని పేర్కొన్నారు. 

అయితే సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌పై సీఎం హిమంత్‌ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అస్సాం చరిత్రపై అవగాహన లేనివారు మాట్లాడొద్దని ఘాటుగా విమర్శించారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదని అన్నారు. కేవలం ఒక సమయంలో ఇరువురికి ఘర్షణలు జరిగినట్లు తెలిపారు.

అది ఒక్కటి మాత్రమే ఆ దేశానికి.. అస్సాంకి ఉ‍న్న ఒ‍క సంబంధమని పేర్కొన్నారు. అంతేకానీ, అస్సాం మయన్మార్‌లో భాగంగా ఉన్నట్లు ఎక్కడా చరిత్రలో రాసినట్లు ఉ‍న్నట్లు తాను చూడలేదని మండిపడ్డారు. ఇక మణిపూర్‌లో అల్లర్లు జరగటానికి మయన్మార్‌ నుంచి వచ్చిన వలసదారులు కూడా ఓ కారణమని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిందే.

ఇది చదవండి: ‘నేను సంతకం చేయలేదు.. కేంద్రమంత్రి క్లారిటీ’

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)