Breaking News

ఈ అద్దెల భారం తట్టుకోలేం

Published on Mon, 11/24/2025 - 10:08

కర్ణాటక: బెంగళూరు నగరం పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడేది ఇంటి బాడుగలు, వాటి అడ్వాన్స్‌ల గురించి. ఇక్కడి అద్దెలు, అడ్వాన్స్‌ల భారం దేశంలో ఎక్కడా కూడా లేదని స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు ముక్తకంఠంతో చెప్పేమాట. ఇళ్లు, భవనాల యజమానులు బాడుగ కావాలంటూ వచ్చేవారిని దోచుకుంటూ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భారం భరించలేక బెంగళూరు సిటీలో కాకుండా సమీపంలోని చిన్న పట్టణాలలో ఉండడానికి ఇష్టపడతారు. దీంతో ఆయా పట్టణాలకు వలసలు పెరిగాయి.  

గత 3 నెలల్లో..  
విపరీతమైన బాడుగల రేట్ల వల్ల గడిచిన మూడు నెలల్లో సిటీలో అద్దె ఇళ్ళకు డిమాండు భారీగా తగ్గుముఖం పట్టిందని మ్యాజిక్‌ బ్రిక్స్‌ సంస్థ తమ నివేదికలో తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో అద్దె ఇళ్ళకు దేశంలోనె అతి ఎక్కువ డిమాండు ఉందని, ఆ తరువాత స్థానంలో బెంగళూరు, చెన్నై ఉండగా, ఇక్కడ డిమాండు పడిపోతున్నట్లు పేర్కొంది. అద్దెలతో పాటు అడ్వాన్స్‌లు పెద్దమొత్తంలో ఉండటమే ప్రముఖ కారణమని తెలింపింది. ఈ జూలై నెల నుంచి సెపె్టంబర్‌ వరకు చేసిన సర్వేలో ఇది తేలిందని పేర్కొంది.  

రూ.30 లక్షల అడ్వాన్సు..  
నిజానికి బెంగళూరు నగరంలో బాడుగలకు ఇళ్ళు దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా కూడా కళ్లు తేలేసే రీతిలో అద్దె, అడ్వాన్సులు ఇచ్చుకోవాలి. అద్దెకు చేరాలంటే రూ.30 లక్షల అడ్వాన్స్‌ ఇవ్వాలని ఇటీవల ఓ డూప్లెక్స్‌ ఇంటి ఓనరు బోర్డు పెట్టడం నెట్‌లో వైరల్‌ కావడం తెలిసిందే. ఇక అద్దె ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. చాలామంది గత్యంతరం లేక అద్దెలకు చేరుతున్నారు. విపరీతమైన ఆర్థికభారం వల్ల కొన్నినెలలుగా అద్దె ఇళ్ళ వ్యాపారం తగ్గిపోయిందని నివేదికలో తెలిపింది. ఉద్యాననగరిలో గతంలో ఉన్నంత గిరాకీ ఇప్పుడు లేదని, చెన్నై నగరంలోనూ ఇదే పరిస్థితి అని తేల్చేసింది. 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)