Breaking News

జమిలి ఎన్నికలపై.. హైలెవెల్‌ కమిటీ

Published on Sun, 09/03/2023 - 05:54

న్యూఢిల్లీ: అధికార బీజేపీ ఎంతోకాలంగా తెరపైకి తెస్తున్న జమిలి ఎన్నికల ప్రతిపాదనపై మరో కీలక ముందడుగు పడింది. లోక్‌ సభతో పాటు, అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల దాకా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై లోతుగా అధ్యయ­నం జరిపి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యం వహిస్తారు. అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌ సహా విపక్షాలకు కూడా కమిటీలో చోటు దక్కడం విశేషం. కేంద్రం తరఫున హోం మంత్రి అమిత్‌ షా, ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ నుంచి లోక్‌ సభలో ఆ పక్ష నేత అదీర్‌ రంజన్‌ చౌధరి కమిటీలో సభ్యులుగా ఉన్నా­రు. కమిటీ తక్షణం రంగంలో దిగి పని చేయడం ప్రారంభిస్తుంది. సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేస్తుంది. కాగా ఈ కమిటీలో చేరేందుకు అ«దీర్‌ రంజన్‌తిరస్కరించడం గమనార్హం.

కమిటీ ఏమేం చేస్తుందంటే... 
► జమిలి ఎన్నికలు సాధ్యపడాలంటే ఏం చేయాలో సిఫార్సులు చేస్తుంది. 
► దీనికి రాజ్యాంగంలో, ప్రజా ప్రాతినిధ్య చట్టం తదితర చట్టాలు, నిబంధనలకు చేయాల్సిన సవరణలు, మార్పులను సూచిస్తుంది. 
► రాజ్యాంగంలోని సంబంధిత అధికరణలకు చేయాల్సిన సవరణలను రా­ష్ట్రా­లు కూ­డా ఆమోదించాల్సిన ఆవ­శ్య­కత ఉందో లేదో పరిశీలిస్తుంది. 
► జమిలి ఎన్నికలు సాధ్యపడాలంటే అందుకు అడ్డంకిగా మారగల హంగ్‌ సభ, అవిశ్వాస తీ­ర్మా­నాలు, పార్టీ ఫిరాయింపు­లు తదితర సమస్యలు, వా­టిని అధిగమించాల్సిన విధా­నాలను పరిశీలిస్తుంది. 
► తమ పరిశీలన, అధ్యయనానికి తోడ్పడేలా, తుది సిఫార్సుల రూపకల్పనలో ఉపకరించేలా ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా, విజ్ఞాపనలు చేసినా కమిటీ స్వీకరిస్తుంది.  

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)