Breaking News

Nuh violence: బుల్‌డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్‌..

Published on Mon, 08/07/2023 - 16:39

చండీగఢ్‌: హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడి ప్రభుత్వం బుల్‌డోజర్ యాక్షన్‌కు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ చర్యలను నిలిపివేయాలని హర్యానా, పంజాబ్‌ హైకోర్టులు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. దీంతో బుల్‌డోజర్‌తో బవనాల కూల్చివేత చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్కట సంబంధిత అధికారులను ఆదేశించారు. 

హర్యానాలో మతపరమైన ఘర్షణలు చెలరేగిన అనంతరం ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటుగా తీసుకుని విచారణ చేపట్టింది. బుల్‌డోజర్ యాక్షన్‌లో ఇప్పటివరకు 350 గుడిసెలు, 50 సిమెంట్ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే.. ప్రభుత్వ చర్య రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఓ వర్గాన్ని లక్ష‍్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తాము అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. 

నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను  ఆదివారం బుల్డోజర్‌లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే నాలుగు  రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి.  సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు.     

విశ్వ హిందూ పరిషత్ రథయాత్రపై కొందరు అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో హర్యానాలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో స్థానిక దేవాలయంలో ప్రాణాలు కాపాడుకున్నారు. అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్దం కావడం అల్లర్ల తీవ్రతను మరింత పెంచింది. 

ఇదీ చదవండి: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్‌..

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)