అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ‍ప్రదర్శన!

Published on Sun, 01/14/2024 - 11:41

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలోనే జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం అయోధ్యలో జనవరి 14 నుండి జనవరి 22 వరకు జరగనుంది.

ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో హేమమాలిని తన నృత్య ప్రదర్శను ఇవ్వనున్నారు. ఈ సంగతిని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ రామ మందిర ప్రతిష్ఠాపన సమయంలో నేను అయోధ్యకు వెళ్తున్నాను. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనతో అక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 

జనవరి 17న అయోధ్యలో జరిగే స్వామి రామభద్రాచార్యుల అమృత మహోత్సవ కార్యక్రమంలో రామాయణం ఆధారంగా ఉండే నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో ఈరోజు (జనవరి 14) నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మాలినీ అవస్తి మొదటి రోజు కార్యక్రమంలో తన ప్రతిభను ప్రదర్శించనున్నారు.

జనవరి 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 మధ్యాహ్నం రామాలయంలోని గర్భగుడిలో రామ్‌లల్లాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. రాముడి జన్మస్థలమైన అయోధ్య దేశ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. 

 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)