Breaking News

క్యాన్సర్‌ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష

Published on Sat, 10/19/2024 - 05:47

క్యాన్సర్‌ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్‌ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్‌ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్‌ వంటి ఈ హెడ్‌గేర్‌ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!

స్కాల్ప్‌ కూలింగ్‌ టెక్నాలజీ 
ఐర్లండ్‌కు చెందిన ల్యూమినేట్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్‌ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్‌ కూలింగ్‌ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్‌గేర్‌ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్‌ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. 

‘‘ఈ హెడ్‌గేర్‌ను ఇప్పటికే యూరప్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్‌ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్‌ హానన్‌ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్‌ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు.

 రొ మ్ము క్యాన్సర్‌ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్‌కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్‌ మార్కెట్లో ఈ హెల్మెట్‌ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్‌ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.

లోపాలూ లేకపోలేదు 
అయితే ఈ స్కాల్ప్‌ కూలింగ్‌ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్‌ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్‌ సందర్భంగా, ముగిశాక హెడ్‌గేర్‌ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్‌ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్‌ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్‌ చెప్పారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)