Breaking News

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌

Published on Fri, 05/09/2025 - 04:44

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో గురువారం జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎం.భాస్కర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఏరో ట్రాన్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన బెల్‌ హెలికాప్టర్‌ డెహ్రాడూన్‌ నుంచి గంగోత్రి సమీపంలోని ఖర్సాలీ హెలిప్యాడ్‌కు టేకాఫ్‌ తీసుకుంది.

ఉదయం 8.45 గంటల సమయంలో రిషికేశ్‌–గంగోత్రి నేషనల్‌ హైవేపై గంగ్నానీ సమీపంలో అదుపు తప్పిన హెలికాప్టర్‌ సుమారు 250 మీటర్ల లోతైన లోయలో కూలిపోయింది. ఆ సమయంలో అందులో పైలట్‌ సహా ఏడుగురున్నారు. ఘటనలో మృతి చెందిన వారిని ఏపీకి చెందిన వేదవది కుమారి(48), విజయా రెడ్డి(57), కళ చంద్రకాంత్‌ సోని(61), రుచి అగర్వాల్‌(56), రాధ అగర్వాల్‌(79), కెపె్టన్‌ రాబిన్‌ సింగ్‌(60)గా గుర్తించారు.

రాబిన్‌ సింగ్‌ స్వస్థలం గుజరాత్‌ కాగా ముగ్గురిది ముంబై, ఒకరిది యూపీ. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏపీ వాసి ఎం.భాస్కర్‌(51)ను వెంటనే మరో హెలిక్టాపర్‌లో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించామని జిల్లా మేజి్రస్టేట్‌ మెహర్బన్‌ సింగ్‌ బిష్త్‌ చెప్పారు. ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాసిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.  

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)