Breaking News

బిపర్‌జోయ్‌ పంజా రాజస్తాన్‌పై

Published on Sun, 06/18/2023 - 05:13

జైపూర్‌/భుజ్‌: గుజరాత్‌ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్‌జోయ్‌ తుపాను పక్కనే ఉన్న రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. తుపాను దెబ్బకు గుజరాత్‌ను ఆనుకుని ఉన్న రాజస్తాన్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మౌంట్‌ అబూలో 210 మిల్లీమీటర్లు, సెడ్వాలో 136 మిల్లీమీటర్లు.. ఇలా తదితర ప్రాంతాల్లో తెరిపినివ్వకుండా వర్షం పడుతోంది. ఎడతెగని వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ బార్మెర్, జలోర్, సిరోహి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

పాలీ, జోధ్‌పూర్‌ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో తుపాను మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే సోమవారం దాకా వర్షాలు ఆగవని వారు వెల్లడించారు. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు రాష్ట్రంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధోల్పూర్‌ ప్రాంతంలో 41.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను కారణంగా నార్త్‌ వెస్టర్న్‌ రైల్వే జోన్‌లో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.

జఖౌలో షా పర్యటన, పరామర్శ..
సొంత రాష్ట్రం గుజరాత్‌లో తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటించారు. ఏరియల్‌ సర్వే చేశారు. సహాయక కార్యక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పనుల్లో నిమగ్నమైన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అభినందించారు. జఖౌ, మండ్వీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. భుజ్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొని తాజా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెల్సుకున్నారు. తుపాను బీభత్సం నుంచి నెమ్మదిగా గుజరాత్‌లోని కఛ్‌ జిల్లా పట్టణాలు, గ్రామాలు కోలుకుంటున్నాయి.

వరద నీరు నివాసాలు, రహదారులను వదలడంతో వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకున్నాయి. గురువారం సాయంత్రం జఖౌ పోర్టులో తీరాన్ని తాకిన తుపాను భీకర రూపం దాల్చి కుండపోత వర్షాలతో ముంచెత్తడం తెల్సిందే. త్వరలో అది వాయుగుండం మారి బలహీనమవనుందని అధికారుల తెలిపారు. శనివారం సైతం బనస్కాంతా జిల్లా, పటాన్‌ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పటాన్, మెహ్‌సానా, కఛ్‌ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఆదివారం సైతం భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, మోర్బీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు.  

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు