Breaking News

కపట ప్రేమకు యువతి బలి

Published on Sat, 03/15/2025 - 08:20

హుబ్లీ: మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని యువతి ప్రాణాలను ప్రేమ పేరుతో ఓ యువకుడు పొట్టన బెట్టుకున్నాడు. హావేరి జిల్లా రాణిబెన్నూరు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతి హత్యకు గురి కాగా ఈ కేసులో ముగ్గురు నిందితులను అనుమానిస్తుండగా, ప్రధాన నిందితుడు నయాజ్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు గురైన యువతిని రత్తిహళ్లి మసూరు గ్రామానికి చెందిన స్వాతి రమేష్‌ బ్యాడగి(22)గా గుర్తించారు.

ఈ నెల 6న యువతి మృతదేహాన్ని రాణిబెన్నూరు తాలూకా పత్తెపుర గ్రామం వద్ద తుంగభద్ర నది సమీపంలో కనుగొన్నారు. ముందుగా గుర్తు తెలియని యువతి శవంగా భావించిన హలగేరి పోలీసులు వారసుదారులు లేని నేపథ్యంలో పోస్టుమార్టం నిర్వహించి చట్టప్రకారం స్వాతి శవాన్ని పూడ్చిపెట్టారు. పోస్టుమార్టంలో స్వాతి హత్యకు గురైనట్లు ధ్రువ పడింది.

 దీంతో దర్యాప్తు చేపట్టిన హలగేరి పోలీసులు ఈ నెల 3న కనిపించకుండా పోయిన యువతి ఆచూకీని కనుగొన్నారు. ఈ క్రమంలో స్వాతి తల్లి హిరేకెరూరు పోలీస్‌ స్టేషన్‌లో తమ కుమార్తె కనిపించలేదని ఫిర్యాదు చేసినట్లుగా తెలుసుకున్నారు. స్వాతి తండ్రి మృతి చెందగా, తల్లితో పాటు యువతి నివసిస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా అనుమానిస్తున్నారు. దర్యాప్తు చురుగ్గా చేపట్టినట్లు హలగేరి పోలీసులు తెలిపారు. కాగా హిందూ సంఘాలు సోషల్‌ మీడియాలో జస్టిస్‌ ఫర్‌ స్వాతి అభియాన్‌ను ప్రారంభించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  

#

Tags : 1

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)