హత్రాస్‌ ఘటన: మృతదేహాల నుంచి నగలు మాయం

Published on Wed, 07/10/2024 - 07:41

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి మరికొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్సంగానికి హాజరైన పలువురు మహిళలు మంగళసూత్రాలు, నగలు వేసుకుని వచ్చారు. అయితే తొక్కిసలాటలో మృతిచెందిన మహిళల మెడలో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీంతో ఇక్కడ మనుషులే కాదు మానవత్వం కూడా చచ్పిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనా స్థలంలో ఇప్పటికీ భయానక దృశ్యానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, దుస్తులు, వంట పాత్రలు, బ్యాగులు.. ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకుని తమవారి వస్తువుల కోసం వెతికారు. వారికి అక్కడ తమ వారి విలువైన వస్తువులేవీ లభించలేదు. తమ ఇంటి మహిళలు మంగళసూత్రాలు, చెవిపోగులు, బంగారు గాజులు ధరించి ఇంటి నుంచి వచ్చారని అయితే వారి మృతదేహాలపై ఉండాల్సిన నగలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

ఆస్పత్రిలో తన తల్లి ఆశాదేవి మృతదేహం ఉందని, అయితే ఆమె సత్సంగానికి వెళ్లిన సమయంలో వేసుకున్న నగలు మాయమయ్యాయని ఆమె కుమారుడు తెలిపాడు. కస్గంజ్‌లోని పాటియాలీ నివాసి బ్రజేష్ తల్లి కూడా ఈ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె మెడలో ఉండాల్సిన నగలు కూడా మాయమయ్యాయి. ఇదేవిధంగా పాటియాలీకి చెందిన జైవీర్‌ తల్లికి చెందిన బంగారు గొలుసు, ముక్కుపుడక, చెవిపోగులు మాయమయ్యాయి. ఘటన అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను ఒకే అంబులెన్స్‌లో ఎక్కించారని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలంలో తగినన్ని అంబులెన్స్‌లు, ఇతర వైద్య సౌకర్యాలు ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావని బాధితులు పేర్కొన్నారు. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)