Breaking News

నాకు లవర్‌ ఉన్నాడు.. చివరి నిముషంలో వధువు షాక్‌

Published on Sat, 05/24/2025 - 08:13

యశవంతపుర(కర్ణాటక): సినిమాలో మాదిరిలో తాళి కట్టే సమయంలో ఆటంకం ఏర్పడింది, వధువు ఈ పెళ్లి చేసుకోనని మొండికేయడంతో వరునితో సహా అందరూ అవాక్కయ్యారు. హాసన్‌ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఆదిచుంచనగిరి కళ్యాణ మంటపంలో పల్లవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌ అనే వధూవరులకు ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. 

అన్నిశాస్త్రాలను పూర్తి చేశారు. వధూవరులను పెళ్లి వేదికపై తీసుకొచ్చి మాంగళ్య ధారణ పూర్తి చేసే సమయంలో వధువు ఈ పెళ్లి వద్దని స్పష్టంచేసింది.  వేరే యువకున్ని  ప్రేమిస్తున్నాను, అతనినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి, తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు బుజ్జగించారు, పోలీసులకు తెలిసి వారు కూడా వచ్చి రాజీ చర్చలు చేశారు. కానీ పెళ్లికూతురు మెట్టు దిగలేదు.   

ముందే చెప్పి ఉంటే..  
ఇంత జరగడంతో వరుడు వేణుగోపాల్‌కు కూడా అవమానం జరిగినట్లు కావడంతో ఈ వివాహం చేసుకోనని చెప్పేశాడు. ఈ పరిణామాలతో వధువు తల్లిదండ్రులు ఎంతగానో విలపించినా పల్లవి మనసు కరగలేదు. ఆమె ప్రేమ విషయం తెలియదు. తెలిసి ఉంటే పెళ్లిని కుదిర్చేవాళ్లమే కాదు అని బంధువులు తెలిపారు. తల్లిదండ్రులు షాక్‌లో ఉండటం వల్ల ఏమి మాట్లాడలేక పోతున్నారు. లక్షలాది రూపాయలను పెళ్లికి ఖర్చు చేశారు. అన్ని రకాలుగా నష్టపోయారు. ఇక పెళ్లికొడుకు వారు కూడా బాగా వ్యయం చేశారు, ఆ మొత్తం పెళ్లికూతురు కుటుంబం నుంచి ఇప్పించాలని పోలీసులను కోరారు. పరువు తీశావు కదే అని బంధువులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు. 

 

 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)