Breaking News

తుపాకీతో కాల్చుకుని.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య

Published on Tue, 10/07/2025 - 17:12

గుర్గావ్: హర్యానా రాజధాని చండీగఢ్‌లో విషాదం జరిగింది. హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాణ్ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) సెక్టార్ 11లో ఉన్న తన నివాసంలోనే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న చండీగఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పురాణ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

పురాణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా? మరేదైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆయన మొబైల్ ఫోన్‌తో పాటు వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్‌కు పోలీస్ శాఖలో మంచి పేరుంది. అలాంటి వ్యక్తి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్‌లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీతో పాటు జపాన్‌ పర్యటనకు వెళ్లారు. భర్త మరణించిన విషయం తెలుసుకున్న ఆమె వెంటనే భారత్‌కు తిరుగు పయనమయ్యారు. ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియాల్సి ఉందని దర్యాప్తు ప్రారంభించామని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)