Breaking News

Haryana: ‘ఆధార్’లో ‘మరణించాడంటే’.. చూసుకోరా?.. హక్కుల కమిషన్‌ సీరియస్‌

Published on Tue, 08/19/2025 - 07:41

చండీగఢ్: ఎవరైనా వ్యక్తి జీవించి ఉండగానే అతని ధృవీకరణ పత్రంలో మరణించి ఉన్నట్లు పేర్కొంటే ఏమి జరుగుతుంది? అతను ఎన్ని అవస్థలు పడతాడు? తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు? సరిగ్గా ఇటువంటి అనుభవమే హర్యానాలోని రోహ్తక్‌ ప్రజారోగ్యశాఖలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఎదురయ్యింది. ఈ నేపధ్యంలో అతని సమస్యను హర్యానా మానవ హక్కుల కమిషన్‌  స్వీకరించింది.

హర్యానాలోని రోహ్తక్‌ ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్నఒక ఉద్యోగికి కోవిడ్ అనంతర కాలంలో.. అతని జీతాన్ని  నిలిపివేయడాన్ని హర్యానా మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. అతను తన కార్యాలయ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ, అతని జీతం నిలిపివేయడాన్ని తప్పుపట్టింది. దీనికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాని కారణమని పేర్కొంది. అతని ఆధార్‌లో మరణించాడు అని తప్పుగా ముద్రితమై ఉండటాన్ని గమనించినప్పటికీ, ప్రజారోగ్యశాఖ అధికారులు హెచ్‌కేఆర్‌ఎన్‌ పోర్టల్‌లో ఆ ఉద్యోగి ‍స్థితిని అప్‌డేట్‌ చేయడంతో విఫలమయ్యారని హక్కుల కమిషన్‌ పేర్కొంది.

ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫిర్యాదుదారు దీర్ఘకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, మానసిక వేదనను అనుభవిస్తున్నాడని హక్కుల కమిషన్‌  ఆందోళన వ్యక్తం చేసింది. చైర్‌పర్సన్ జస్టిస్ లలిత్ బాత్రా, సభ్యులు కుల్దీప్ జైన్, దీప్ భాటియాలతో కూడిన ధర్మాసనం.. ఈ ఘటన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడిక (ఐసీఈఎస్‌సీఆర్‌)లోని ఆర్టికల్ 7 కు విరుద్ధంగా  ఉన్నదని పేర్కొంది. ఈ ఆర్టికల్‌ కార్మికులు, వారి కుటుంబాల న్యాయపరమైన హక్కును గుర్తిస్తుంది.

పరిపాలనా అధికారుల నిర్లక్ష్యంపై ఆధారాలు లభించిన నేపధ్యంలో  కమిషన్ ఆ ఉద్యోగి జీతం పునరుద్ధరించేందుకు, అతనికి సంబంధించిన అన్ని రికార్డులను సరిచేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే భవిష్యత్తులో  ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని పేర్కొంది.  ఈ కేసులో సెప్టెంబర్ 23న జరగబోయే తదుపరి విచారణకు ముందుగానే ఫిర్యాదుదారుని సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదికను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)