Breaking News

Haryana: ఐపీఎస్ ఆఫీసర్‌ ఆత్మహత్య: సీనియర్ పోలీసు అధికారిపై వేటు

Published on Sat, 10/11/2025 - 12:47

చండీగఢ్‌: ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య హర్యానా పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్య కేసులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా సీనియర్ పోలీసు అధికారి నరేంద్ర బిజార్నియాను తొలగించారు. బిజార్నియా స్థానంలో రోహ్‌తక్ ఎస్పీగా సురీందర్ సింగ్ భోరియా నియమితులయ్యారు. బిజార్నియాకు ఇప్పటివరకు ఎటువంటి పదవి ఇవ్వలేదు.

ఈ కేసులో హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు మరికొందరు ఉన్నతాధికారులపై కేసు నమోదయ్యింది. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు  కేసు నమోదు చేశారు. 2001 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్  ఇటీవల చండీగఢ్‌లోని తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు పేజీల సూసైడ్ నోట్ లభించింది. దానిలో అతను కొందరు సీనియర్ అధికారులు తనను మానసికంగా వేధించారని, కులం పేరుతో అవమానించారని ఆరోపించారు. ఈ ఘటన దరిమిలా పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  అక్టోబర్ 7న ఏడీజీపీ వై పూరన్ కుమార్ మృతితో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దళిత సంస్థలు, రాజకీయ నేతలు త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)