Breaking News

Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్‌లాల్‌ కన్నుమూత

Published on Thu, 05/18/2023 - 09:46

చండీగఢ్‌: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్‌లాల్‌ కటారియా(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో (న్యుమోనియా) బాధపడుతున్న రతన్‌లాల్‌.. చండీగఢ్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని అంబాలా నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 నుంచి 2021 వరకు రతన్‌లాల్‌ కేంద్రమంత్రిగా పనిచేశారు. కేంద్ర జల్‌శక్తి, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

కటారియా మృతిపట్ల హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, స్పీకర్ జియాన్ చంద్ గుప్తా సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం అధికార లాంఛనాలతో రతన్‌లాల్‌ కటారియా అంత్యక్రియలు జరగనున్నాయి.  కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అంబాలా లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి సెల్జాపై 57 శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అంతకు ముందు 1999, 2014లో అంబాలా నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కుమారి సెల్జా చేతిలో ఓటమిని చవిచూశారు.
చదవండి: హైదరాబాద్‌కు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ.. 1200 మందికి ఉపాధి

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు