Breaking News

Haridwar: స్కూలుకు రాలేదని.. నేలపై పడేసి, బూటుతో తొక్కేసి..

Published on Sat, 09/13/2025 - 11:07

హరిద్వార్: ఉత్తరాఖండ్‌లో ఘోరం చోటుచేసుకుంది. స్కూలుకు రెండ్రోజులు రాలేదని ఏడేళ్ల చిన్నారిపై ఇద్దరు ఉపాధ్యాయులు అమానుషంగా ప్రవర్తించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలోని ఒక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలుని తండ్రి తొలుత ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో అతను ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాలుని తండ్రి ఫిర్యాదు ప్రకారం ఏడేళ్ల బాలుడిని ఇద్దరు ఉపాధ్యాయులు అమానుషంగా కొట్టారు. రెండు రోజులు స్కూలుకు రాలేదని వారు  ఆ బాలుడిని నేలపై పడవేసి, అతని ముఖాన్ని బూటుతో అదిమిట్టారు. అదే సమయంలో మరో ఉపాధ్యాయుడు బాలుడిని కర్రతో కొట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. జాబ్రేడా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అజయ్ షా మాట్లాడుతూ  ఆ పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న  విద్యార్థి రెండు రోజులు గైర్హాజరు అయ్యాడు. ఆ తర్వాత  క్లాసుకు వెళ్లినప్పుడు, అతనిని కొట్టారు. నిందితులు ఇద్దరికీ నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

కాగా టీచర్లు కొట్టిన కారణంగా పిల్లవాడి చేయి ఎముక విరిగింది. అతని వీపు, తుంటిలో కూడా గాయాలు అయ్యాయి. బాలుడు ఇప్పటికీ షాక్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 11న ఇంటికి తిరిగి వచ్చిన  బాలుడు స్కూలులో జరిగిన ఘటన గురించి ఇంట్లో  చెప్పాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారు ఆ చిన్నారి మెడికల్‌ రిపోర్టు, అతని వీపుపై పడిన ఎర్రటి మచ్చలు ఫొటోలను పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ (పిల్లల సంరక్షణ) సెక్షన్ 75 కింద కేసు నమోదు చేశారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)