Breaking News

2024.. దునియాలో కొత్తగా జరగనుంది?

Published on Mon, 01/01/2024 - 08:34

కొత్త సంవత్సరం వచ్చేసింది... 2024లో మనలో చాలా మంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. 2024 సంవత్సరంలో మనమంతా పలు ఆవిష్కరణలను చూడబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియోని మనం చూడబోతున్నాం. అదే సమయంలో పోషకాహార లోపాన్ని తొలగించగల దివ్య ఔషధం మన ముందుకు రాబోతోంది.

చర్చిలో మహిళా మతాధికారులు
కాథలిక్కులు మహిళలను మతాధికారులుగా నియమించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే 2024లో ‘కానన్ లా’లో మార్పు రానుంది. కాథలిక్ చర్చిలు ఈ చట్టం ప్రకారం నడుచుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో  కాథలిక్ నియమాలలో పలు సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి.

పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధం 
బిల్ గేట్స్ ఫౌండేషన్ పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని తీసుకురానుంది. పోషకాహార లోపాన్ని నివారించే ఔషధంపై స్టేజ్-3 ట్రయల్‌ జరుగుతోంది. 2024లో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందింది. ఈ ఔషధం వల్ల భారతదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 

చంద్రునిపైకి నలుగురు మానవులు 
2024లో ‘నాసా’ నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్‌లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది. 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రునిపైకి మనుషులను పంపుతోంది.

అందుబాటులోకి సూపర్ కంప్యూటర్  
యూరప్‌ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్ 2024లో అందుబాటులోకి రానుంది. జర్మనీలోని జూలిచ్‌లోని నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ సూపర్‌కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్‌  మెరుపువేగంతో పనిచేయనుంది.

అతిపెద్ద వ్యోమనౌక
అతిపెద్ద అంతరిక్ష నౌక క్లిప్పర్ మిషన్ నిర్మితం కానుంది. ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కిలోలు ఉంటుంది. ఈ వ్యోమనౌక పొడవు బాస్కెట్‌బాల్ కోర్ట్ అంటే 30 మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. జూపిటర్ మిషన్ కోసం సిద్ధం చేసిన ఈ అంతరిక్ష నౌకలో 24 ఇంజన్లు ఉంటాయి.

మూడవసారి పారిస్‌లో ఒలింపిక్స్ 
2024లో పారిస్‌లో మూడవసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగిన ఏకైక నగరం లండన్. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు దాదాపు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది. 

అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో 
2024లో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. ఈ స్పేస్ స్టూడియో పేరు ఎస్‌ఈఈ-1. డిసెంబర్ 2024 నాటికి ఈ స్టూడియో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్టూడియో సాయంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు. 
ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)