Breaking News

హెలిప్యాడ్‌ను అలానే ఎందుకు రూపొందిస్తారో తెలుసా?

Published on Sat, 05/27/2023 - 14:09

ఆకాశంలో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లను మనమంతా చూసేవుంటాం. విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు రన్‌వే అవసరం అవుతుంది. హెలికాప్టర్లు ఎక్కడైనా ల్యాండ్‌ అవుతాయి.అయితే హెలికాప్టర్‌ ఆగేందుకు నిర్దేశిత ప్రదేశంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.ఇది వృత్తాకారంలో కనిపిస్తుంది. దీనిలోపలనే హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుంది. అయితే ఈ వృత్తాకారం లోపల ఇంగ్లీషు బాషలోని హెచ్‌ అక్షరం రాసివుంటుంది. ఇలా ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోని అన్ని దేశాలలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేప్రాంతంలో హెచ్‌ అని రాసివుంటుంది. హెలికాప్టర్లను వీవీఐపీలు వినియోగిస్తారనే సంగతి మనకు తెలిసిందే. హెలికాప్టర్ల వినియోగానికి సంబంధించి పలు దేశాల్లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. హెలికాప్టర్లు ల్యాండ్‌ అ‍య్యేందుకు ఒక్కోసారి హెలిప్యాడ్‌లను తయారు చేస్తుంటారు. దీనిలో రూపొందించే హెచ్‌ ఆకారం హెలికాప్టర్‌ నడిపే పైలెట్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.

దీని కారణంగానే హెలికాప్టర్‌ ముందుభాగం, వెనుకభాగం ఎటువైపు ఉంచాలనేది పైలెట్‌కు తెలుస్తుంది. దీనిని తగిన రీతిలో నిలిపివుంచడం వలన హెలికాప్టర్‌లో ప్రయాణించేవారికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. సాధారణంగా వీవీఐపీ కేటగిరీలోకి వచ్చేవారు ఎంతో బిజీగా ఉంటారు. వీరి సమయం వృథాకాకుండా ఉండేందుకు కూడా హెలిప్యాడ్‌ రూపకల్పన ఉపకరిస్తుంది.
చదవండి: ‘స్నేక్‌ వైన్‌’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే...

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)