Breaking News

జ్ఞానవాపి కేసు: ముస్లిం సంఘాలకు చుక్కెదురు

Published on Tue, 12/19/2023 - 10:53

ఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌పై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది.

ఈ మేరకు మంగళవారం అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్‌ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. 

మొఘల్‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్‌ డేటింగ్‌, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్‌ప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు, అంజుమన్‌ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)