Breaking News

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Published on Sun, 07/21/2024 - 07:24

ఈరోజు(ఆదివారం) గురుపౌర్ణమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల వేడుకలు నిర్వహిస్తున్నారు. యూపీలోని వారణాసికి పెద్దసంఖ్యలో చేరుకున్న భక్తులు గంగాఘాట్‌ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం అధికార యంత్రాంగం ఘాట్‌ల దగ్గర పటిష్ట ఏర్పాట్లు చేసింది. యూపీలోని లక్నో, ఆగ్రా, కాన్పూర్, మీర్జాపూర్, ఘాజీపూర్, ప్రయాగ్‌రాజ్ తదితర ప్రాంతాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 

సనాతన సంప్రదాయంలో గురుపౌర్ణమి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాయిబాబా కొలువైన మహారాష్ట్రలోని షిర్డీలో జరుగుతున్న గురుపౌర్ణమి వేడుకలకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గురుపౌర్ణమి సందర్భంగా సాయినగరి షిర్డీ భక్తులతో కిటకిటలాడుతోంది. షిర్డీలో మూడు రోజుల పాటు గురుపౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయిబాబా సంస్థాన్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. 

శనివారం తెల్లవారుజామున కాగడ హారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తరువాత సాయి జీవిత చరిత్ర పుస్తకాల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం రోజంతా సాయి మందిరాన్ని భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంచనున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)