Breaking News

ఆ ప్రబుద్ధుడిపై కోర్టు ధిక్కరణ చర్యలు! 

Published on Sun, 07/06/2025 - 06:29

అహ్మదాబాద్‌: ఇంట్లో టాయిలెట్‌ సీటుపై కూర్చొని న్యాయస్థానంలో జరిగిన విచారణకు వర్చువల్‌గా హాజరైన వ్యక్తిపై గుజరాత్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ ఆరోపణల కింద ఆ ప్రబుద్ధుడిపై సుమోటోగా విచారణ ప్రారంభించింది. జూన్‌ 20వ తేదీన కోర్టులో జస్టిస్‌ నిర్జర్‌ ఎస్‌.దేశాయ్‌ ఓ కేసులో విచారణ చేపట్టారు. ఇందులో కక్షిదారుగా ఉన్న ఓ వ్యక్తి పసుపు రంగు టి–షర్టు ధరించి ఇంటి నుంచే వర్చువల్‌గా హాజరయ్యాడు. కానీ, టాయిలెట్‌ సీటుపై కూర్చొని మాట్లాడాడు. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తిని సూరత్‌ జిల్లాలోని కిమ్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ సమద్‌గా గుర్తించారు. అతడి ప్రవర్తనపై జస్టిస్‌ ఏఎస్‌ సుపేహియా, జస్టిస్‌ ఆర్‌టీ వచానీతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీవ్రంగా స్పందించింది. వీడియోలో అభ్యంతరకరంగా కనిపించిన అబ్దుల్‌ సమద్‌పై సుమోటోగా విచారణ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. 

చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఎందుకు విచారణ జరిపి శిక్షించకూడదో ప్రశి్నస్తూ అతడికి నోటీసు జారీ చేయాలని పేర్కొంది. ఈ ఉత్తర్వును తాజాగా హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. అబ్దుల్‌ సమద్‌ ప్రవర్తన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. సంబంధిత వీడియోను సోషల్‌ మీడియా నుంచి తొలగించాలని స్పష్టంచేసింది. కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి లాయర్లు, కక్షిదారులు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు గుజరాత్‌ హైకోర్టు అనుమతి ఇస్తోంది. అంతేకాకుండా హైకోర్టులో జరిగే విచారణను కోర్టు యూట్యూబ్‌ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు.   
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు