Breaking News

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. తగ్గిన వాటర్‌ బాటిల్‌ ధర

Published on Sat, 09/20/2025 - 16:29

భారతీయ రైల్వేస్‌ తన ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగించింది. వాటర్‌ బాటిల్‌ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తగ్గించిన ఈ ధరలు సోమవారం(సెప్టెంబర్‌ 22) తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో.. F(C) డైరెక్టరేట్ అంగీకారంతో తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధర (MRP) తగ్గించబడింది. ఈ ధరలు రైల్వే స్టేషన్లు, రైళ్లలో అమ్మకానికి వర్తిస్తాయి. ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన తాగునీరు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రైల్‌ నీర్‌ లీటర్‌ బాటిల్‌ ధరను తగ్గించినట్లు ప్రకటించింది. ఇంతకు ముందు అది 15 రూపాయలు ఉండగా.. ఇప్పుడు దానిని 14 రూపాయలుగా మార్చింది. అలాగే.. అర లీటర్‌ బాటిల్‌ ధరను రూ.10 నుంచి రూ.9కి తగ్గించినట్లు తెలిపింది. రైల్‌ నీర్‌ అనేది ప్రభుత్వ నియంత్రణలో.. ఐఆర్‌సీటీసీ ద్వారా సరఫరా అవుతోంది. అయితే ఇతర బ్రాండ్లు మాత్రం మార్కెట్‌ ఆధారంగా రేట్లకే అమ్ముతుంటాయి. అయితే.. 

రైల్‌ నీర్‌ మాత్రమే కాదు.. ఇతర బ్రాండ్ల వాటర్‌ బాటిల్స్‌ను రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలో ఎమ్మార్పీ (బాటిల్‌పై ఉన్న రేటు కంటే ఎక్కువ) అమ్మితే అది నేరమే. వాటర్‌ బాటిల్స్‌ మాత్రమే కాదు.. ఇతర ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుంది. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిమిషాల్లోనే ఫిర్యాదు చేసే వీలు ఉంది. 

లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌(2009 ప్రకారం).. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేయడం నేరం. దీనిపై వినియోగదారుల రక్షణ కట్టం కింద ప్రయాణికులు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం రైల్వే శాఖ IRCTC, Rail Madad వంటివి అందుబాటులో ఉన్నాయి. 

రైల్‌ మదద్‌ యాప్‌గానీ, వెబ్‌గానీ(https://railmadad.indianrailways.gov.in)  లింక్‌ ఓపెన్‌ చేసి ఓవర్‌ చార్జింగ్‌ ఆఫ్‌ వాటర్‌ బాటిల్‌ “Overcharging of water bottle” అని అంశాన్ని ఎంచుకుని వివరాలు నమోదు చేయండి. అదే ఐఆర్‌సీటీసీలో అయితే వెబ్‌సైట్(https://www.irctc.com) కంప్లయింట్‌ సెక్షన్‌లో ఫిర్యాదు నమోదు చేయొచ్చు. ఈ మార్గాలే కాదు.. 

COMPLAIN అని టైప్‌ చేసి ఫిర్యాదును పొందుపరిచి అని 139 నెంబర్‌కూ మెసేజ్‌ పంపొచ్చు. ఈ ఫిర్యాదులో.. స్టేషన్ పేరు / రైలు నంబర్, తేదీ, సమయం, అమ్మిన వ్యక్తి పేరు (అందుబాటులో ఉంటే), బాటిల్ ధర.. వసూలు చేసిన ధర, మీ టికెట్ వివరాలు (కంపల్సరీ ఏం కాదు) పొందుపర్చాలి. లేకుంటే నేరుగా స్టేషన్ మాస్టర్, కమర్షియల్ ఇన్‌చార్జ్, లేదంటే టికెట్ చెక్ చేసే సిబ్బంది కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే బిల్ లేకుండా అధిక ధర వసూలు చేసినా వెంటనే అధికారులకు తెలియజేయొచ్చు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)