Breaking News

జీఎస్టీ అధికారి ఇంట్లో మిస్టరీ మరణాలు..!

Published on Sat, 02/22/2025 - 11:07

కొచ్చి:కేరళలోని కొచ్చిలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్‌కు చెందిన 42 ఏళ్ల జీఎస్టీ అధికారితో పాటు అతడి 80 ఏళ్ల తల్లి,35ఏళ్ల సోదరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరు చనిపోయి నాలుగు రోజులవుతోందని,మృతదేహాలు కుళ్లిపోవడం స్టార్టైందని కొచ్చి త్రిక్కాకర పోలీసులు తెలిపారు.

జీఎస్టీ అధికారి ఇంటిలో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తలుపు తెరవగా మరణాల విషయం బయటపడింది.అధికారి తల్లి మృతదేహం ఒక షీట్‌తో కప్పిఉండడం అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారి సోదరి జార్ఖండ్‌ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌(జేఏఎస్‌) అధికారిగా పనిచేస్తున్నారు.

ఆమె పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలో తొలి ర్యాంక్‌ సాధించారు. అయితే పరీక్షల అవకతవకలకు సంబంధించి ఆమెపై ప్రస్తుతం సీబీఐ కేసు విచారణలో ఉంది. ఆమె మరణం ఆశ్చర్యానికి గురిచేసిందని  తోటి జేఏఎస్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వీరివి ఆత్మహత్యలనే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం వివరాలొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)