Breaking News

బిహార్‌లో పెళ్లి కొడుకును అపహరించారు

Published on Mon, 05/26/2025 - 08:03

పట్నా: పెళ్లి మండపం నుంచి పెళ్లి కుమారుడు కిడ్నాప్‌ కావడం ఎక్కడైనా విన్నామా? బిహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లాలోని దిఘ్వా దబౌలీ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పెళ్లి వేడుక కాస్తా రణరంగంగా మారిపోయింది. పెళ్లిలో అతిథులను అలరించడానికి వచ్చిన డ్యాన్సర్ల బృందం పెళ్లి కొడుకు సోనూకుమార్‌ శర్మను అపహరించింది. తొమ్మిది గంటల తర్వాత అతడి ఆచూకీ దొరకడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. 

అసలేం జరిగిందంటే... పెళ్లి సమయంలో డ్యాన్సర్ల బృందం పలు రకాల నృత్యాలతో అలరించింది. అప్పటికే సమయం మించిపోవడంతో తాము కార్యక్రమం ఆపేస్తామని డ్యాన్సర్లు చెప్పడంతో అతిథులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్సులు కొనసాగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దానికి డ్యాన్సర్లు ఒప్పుకోలేదు. దాంతో ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ముస్కాన్‌ కిన్నార్‌ అనే కళాకారుడు గాయపడ్డాడు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని మళ్లీ వివాహ మండపానికి చేరుకున్నాడు.

 ఆ సమయంలో పెళ్లికొడుకు సోనూకుమార్‌ శర్మ మండపంలోనే ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో డ్యాన్సర్ల బృందం పెళ్లి కుమారుడిని అపహరించింది. అందరూ చూస్తుండగానే వాహనంలో ఎక్కించి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. వరుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వరుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. తొమ్మిది గంటల తర్వాత సివాన్‌ జిల్లాలో అతడి అచూకీ  కనిపెట్టారు. కిడ్నాప్‌ చేసిన డ్యాన్సర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, డ్యాన్సర్లకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఘర్షణ జరిగిందని గోపాల్‌గంజ్‌ ఎస్పీ అవదేశ్‌ దీక్షిత్‌ చెప్పారు.   

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)