భద్రాద్రిలో గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు

Published on Fri, 09/20/2024 - 06:19

సాక్షి, న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, రాష్ట్రంలో కోకోనట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో భాగంగా తుమ్మల కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రా లు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్మోహన్‌ నాయుడును కోరినట్లు తెలిపారు. తెలంగాణలో నూతన కోకోనట్‌ బోర్డ్‌ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కోరానన్నారు.

 ఆయిల్‌పామ్‌ మీద 28% దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నందుకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్‌పామ్‌కు కేంద్రం కనీస మద్దతు ధర కలి్పంచాలని కోరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా విన్నవించారు. ఇటీవలి వరదల్లో నష్టపోయిన ఖమ్మం జిల్లాకు తగిన మొత్తంలో సహాయం అందజేయాలని కోరారు. 

నష్టంపై నివేదిక రాగానే సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపారు. కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ను కలిసి, తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అలాగే.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొని.. తెలంగాణలోని అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్‌ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని ఆహా్వనించానన్నారు. 

సాగు చేసేవారికే రైతుబంధు
వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కౌలు రైతు, భూమి యజమాని చర్చించుకొని రైతుబంధు ఎవరు తీసుకోవాలన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో కౌలు రైతు ఒప్పందాలు లేవని గుర్తుచేశారు. ఐదేళ్లలో కేసీఆర్‌ రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ఒకేసారి రూ.18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. అవసరమైతే ఇంకా నిధులు సమకూరుస్తామని తెలిపారు. ప్రతి పంట, ప్రతి రైతుకు వర్తించేలా రూ.3,000 కోట్లతో బీమా చేయనున్నట్లు తుమ్మల తెలిపారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)