Breaking News

‘గ్రాప్‌-3’ ఉల్లంఘనలు.. ఒక్కరోజులో రూ 5.85 కోట్ల చలానాలు

Published on Sun, 11/17/2024 - 07:45

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ‘గ్రాప్-3’ నిబంధనలను అమలు చేసింది. అయినప్పటికీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. గాలి నాణ్యత శనివారం మరింత దిగజారింది. పలు ప్రాంతాల్లో ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది.  

కాలుష్యాన్ని మరింతగా తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (గ్రాప్‌)ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పడు గ్రాప్‌-3ని ఆచరణలో పెట్టింది. అయితే ఇది అమలు చేసిన మొదటి రోజునే ఈ విధానంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 5.85 కోట్ల జరిమానా విధించింది. గ్రాప్‌-3ని అమలు చేసినప్పటికీ వాయు కాలుష్యంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు.

శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)417గా ఉంది. శుక్రవారం ఇదే సమయంలో ఏక్యూఐ 396గా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం వాయునాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరికి చేరినప్పుడు జనం అనారోగ్యం బారిన పడతారు. ఇప్పటికే అనారోగ్యంతోవున్నవారు మరిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

నిషేధం ఉన్నప్పటికీ బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్ వాహనాలను వినియోగిస్తున్న వారికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు  దాదాపు 550 చలానాలను విధించారు. బీఎస్- 3 పెట్రోల్, బీఎస్- 4 డీజిల్, నాలుగు చక్రాల వాహనాలపై కూడా నిషేధం విధించామని, దీనిని ఉల్లంఘిస్తే రూ.20 వేలు జరిమానా విధించే నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు (పీయూసీసీ)లేని వాహనాలకు కూడా పోలీసులు చలానాలు ఇచ్చారు.  శుక్రవారం ఒక్కరోజునే  4,855 వాహనాలపై మొత్తంగా రూ.5.85 కోట్ల జరిమానా విధించారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల ‍ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)