Breaking News

సుద్దమొద్దు టీచర్‌ అవసరమా?

Published on Fri, 08/01/2025 - 16:55

మీ పిల్లల మార్కుల సంగతి సరే.. కానీ, వాళ్లు ఎలా చదువుతున్నారో ఎప్పుడైనా గమనిస్తున్నారా?. పోనీ వాళ్ల టీచర్లు ఏం చదువు చెబుతున్నారో ఆరా తీస్తున్నారా?. లేదా?? అయితే ఇకనైనా ఆ పని చేయండి. దాని కంటే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి.

 

పై వీడియోలో ఉంది ఓ గవర్నమెంట్‌ టీచర్‌. బోధించేది ప్రైమరీ స్కూల్‌లో ఆంగ్లం సబ్జెక్ట్‌. ఆయనకు జీతం రూ.70 వేలపైనే. కానీ, Eleven, Nineteen స్పెల్లింగులు రాయలేక ఇబ్బంది పడ్డారు. Elevenను Aivene అని, Nineteenను Ninithin అని తప్పు తప్పుగా రాశారు. పైగా ఈ ఘటన సరిగ్గా విద్యాశాఖ అధికారి ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన టైంలో జరిగింది. ఆ తప్పులతోనే ఆయన వాళ్లకు అలాగే పాఠాలు బోధించారు. అంతేకాదు మన దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ల పేర్లు కూడా ఆ టీచర్‌ చెప్పలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

ఇక్కడ ఆ టీచర్‌ను అవమానించడం ఉద్దేశం కాదు. కానీ, గ్రామీణ విద్యా వ్యవస్థపై ప్రభుత్వాలు సారిస్తున్న దృష్టి ఏపాటిదో అనేది ఈ ఘటన బయటపెట్టింది. ఛత్తీస్‌గఢ్‌ బాల్‌రాంపూర్‌ జిల్లా ఘోడాసోట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వీడియో వైరల్‌ కావడంతో  ఛత్తీస్‌గఢ్ విద్యా శాఖ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించింది.

మరోవైపు.. ఉపాధ్యాయుల ఎంపిక, శిక్షణ, మానిటరింగ్ పద్ధతులపై సోషల్‌ మీడియాలో ప్రశ్నలు కనిపిస్తున్నాయి. వేలకు వేలు జీతం పొందుతున్న ఉపాధ్యాయులు కూడా ప్రాథమిక ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లు తెలియకపోవడం విడ్డూరమనే కామెంట్లు కనిపిస్తున్నాయి. గుడ్డిగా పోస్టింగ్‌లు ఇవ్వకుండా రాటుదేలిన ఉపాధ్యాయులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు కొందరు. మరికొందరేమో.. ఆ టీచర్‌ను రీ-ట్రైనింగ్‌కు పంపాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఈ మధ్యే అకడమిక్‌ ఈయర్‌ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి శిక్షా గుణవత్తా అభియాన్‌ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్‌ కింద టీచర్లు లేని స్కూల్స్‌ ఇక మీదట ఉండకూడదని, ప్రతీ బడిలో కనీసం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండాలని, తమ పిల్లలకు సరిగా పాఠాలు బోధించని టీచర్లను తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితులు రావాలని.. ముఖమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ ఓ ప్రకటన చేశారు. ఈ తరుణంలో ఈ టీచర్‌ వీడియో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశమైంది. 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)