Breaking News

8 లక్షల రేషన్‌ కార్డుల రద్దు!

Published on Wed, 09/17/2025 - 13:11

కర్ణాటక: రాష్ట్రంలో అక్రమంగా కలిగిఉన్న బీపీఎల్‌ కార్డులను రద్దు చేయడంపై బుధవారం ఉదయం ముఖ్యమైన సమావేశం జరుగుతుందని ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్‌.మునియప్ప చెప్పారు. రేషన్‌ కార్డుల సమస్యల పరిష్కారం గురించి అందులో మాట్లాడుతానని మంగళవారం బెంగళూరులో తెలిపారు. రేషన్‌ పంపిణీ భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది.  

6 లక్షల కార్డులకు ఈకేవైసీ లేదు 
రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బీపీఎల్‌ కార్డులు రద్దు అయ్యే అవకాశముందని తెలిసింది. పేదలు కాకపోయినా ఈ కార్డులను కలిగి ఉన్నట్లు ప్రభుత్వం కనుగొంది.  

  • సర్కారు సర్వేలో మొత్తం 12,68,097 అనుమానాస్పద రేషన్‌ కార్డులు బయటపడ్డాయి. 

  • 19,690 మంది నియమాలకు విరుద్ధంగా బీపీఎల్‌ కార్డులు కలిగిఉన్నారు  

  • ఏటా రూ.25 లక్షలకు పైగా లావాదేవీలు కలిగినవారు 2,684 మందికి కార్డులు ఉన్నాయి.  

  •  6,16,196 మంది కార్డుదారులు ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోలేదు. 

  • ఏటా రూ.1.20 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన కార్డుదారులు 5,13,613 మంది ఉన్నారు.  

  • అంతర్రాష్ట్ర కార్డుదారులు 365 మంది, 7.5 ఎకరాల కంటే అధిక భూమి ఉన్న 33,456 కుటుంబాలు రేషన్‌ తీసుకుంటున్నాయి.  

  • ఆరు నెలల నుంచి రేషన్‌ పొందని కార్డుదారులు 19,893 మందిగా తేలింది. 

  • 1,146 కార్డులు మృతుల పేర్లతో ఉన్నాయి.  

  • 119 మంది కార్డుదారులకు సొంత కార్లు, జీప్‌లు ఉన్నాయి. 

  • ఇలా అనేక అవకతవకలు బయటపడడంతో ఆ కార్డులను  రద్దు చేయాలని ప్రభుత్వం  భావిస్తోంది.
     

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)