Breaking News

హెలికాప్టర్‌ వద్ద సెల్ఫీ తీసుకుంటుండంగా..అంతలోనే..

Published on Sun, 04/23/2023 - 16:10

ఓ అధికారి హెలికాప్టర్‌ వద్ద సెల్ఫీ తీసుకునే యత్నంలో టెయిల్‌​ రోటర్‌ బ్లేడ్‌ పరిధిలోకి వచ్చాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌ బయట సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వాధికారి మృత్యువాత పడ్డారు. బాధితుడిని జితేంద్ర కుమార్‌ సైనీగా గుర్తించారు అధికారులు. అతడు ఉత్తరాఖండ్‌ సివిల్‌ ఏవియేషన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రమాదం కేదార్‌నాథ్‌ ధామ్‌లోని హెలిప్యాడ్‌ వద్ద జరిగింది. సైనీ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నసమయంలో అనుకోకుండా హెలికాప్టర్‌ టెయిల్‌ రోటర్‌ బ్లేడ్‌ పరిధిలోకి వచ్చాడు. దీంతో సైనీ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అక్షయ తృతియ సందర్భంగా భక్తుల చార్‌ధామ్‌ యాత్ర కోసం అని గంగోత్రి, యమునోత్రి పోర్టల్‌లను ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఈ అనూహ్య సంఘటన జరిగింది. కాగా తీర్థ యాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. ఐతే కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని ఏప్రిల్‌ 25న బద్రీనాథ్‌ను ఏప్రిల్‌ 27న తెరవనున్నారు. 

(చదవండి: చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)