Breaking News

మూడుసార్లు చెప్పినా పట్టించుకోలేదు!

Published on Thu, 07/24/2025 - 06:39

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి సలహాలు, సూచనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలన్న రాజ్యాంగానికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ బద్దుడై లేడని తాజాగా మోదీ సర్కార్‌ వాదనలు తెరమీదకొస్తున్నాయి. సగం కాలిన కరెన్సీ కట్టల ఉదంతంలో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై లోక్‌సభలో ప్రభుత్వం తీర్మానం తెచ్చే పనిలో ఉంటే ఆ విషయం తెల్సి కూడా ఉద్దేశపూర్వకంగా రాజ్యసభలో విపక్ష నేతలు సమర్పించిన నోటీస్‌ను ధన్‌ఖడ్‌ ఆమోదముద్రవేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

 ఈ అంశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతతో ధన్‌ఖడ్‌ ప్రత్యేకంగా సంప్రతింపులు జరిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తమను సంప్రతించకుండా రాజ్యసభలో తుది నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వ పెద్దలు అప్పటికే మూడుసార్లు ధన్‌ఖడ్‌కు చెప్పిచూశారని, అయినా ఆయన వినిపించుకోలేదని తెలుస్తోంది. రాజ్యసభలో ఎన్‌డీఏ కూటమి ఎంపీల సంతకాలు లేని విపక్షాల నోటీస్‌కు ధన్‌ఖడ్‌ ఆమోదం తెలిపారు. 

ఈ నోటీస్‌కు బదులు ఏకాభిప్రాయంతో ఎన్‌డీఏ ఎంపీల సంతకాలతో కూడిన నోటీస్‌ రూపకల్పనకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్‌ మేఘ్వాల్, రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డాలు ప్రయత్నిస్తున్నారని ధన్‌ఖడ్‌కు ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఆ నోటీస్‌ కార్యరూపం దాల్చేలోపే విపక్షాల నోటీస్‌ను ధన్‌ఖడ్‌ అంగీకరించి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించారని తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలకు నాలుగైదు రోజుల ముందే ధన్‌ఖడ్‌కు ప్రభుత్వం ఒక కబురు పంపింది.

 లోక్‌సభలో అన్ని పారీ్టల సమ్మితితో అభిశంసన తీర్మానం తీసుకొస్తామని, తర్వాత రాజ్యసభలోనూ ఇలాంటి తీర్మానం తీసుకొస్తామని ధన్‌ఖడ్‌కు సమాచారమిచ్చారు. సోమవారం వర్షాకాల సమావేశాలు మొదలుకాగా ఒకరోజు ముందే అంటే ఆదివారమే విపక్ష నేతలతో ధన్‌ఖడ్‌ ప్రత్యేకంగా సమావేశమై అభిశంసన అంశంపై చర్చించారు. ఈ విషయం ఆలస్యంగా ప్రభుత్వ పెద్దలకు తెల్సింది. భేటీ విషయం బయటకు పొక్కిందని తెల్సికూడా అసలు విపక్ష నేతలకు తన కు ఏం చెప్పారనే అంశాలను ధన్‌ఖడ్‌ ప్రభుత్వ పె ద్దలకు వివరించకుండా మిన్నకుండిపోయారని తెలుస్తోంది.

 అయితే విపక్షనేతలిచ్చే నోటీస్‌కే ఆమోదం తెలపాలని ముందే ధన్‌ఖడ్‌ నిర్ణయించుకున్నారని సోమవారం మోదీ సర్కార్‌కు అర్థమైపోయింది. వెంటనే ధన్‌ఖడ్‌ను కలిసి బీజేపీ ఎంపీల సంతకాలు చేశాక విపక్షాల నోటీస్‌కు ఆమోదం తెలపాలని ఆయనకు సూచించినా వినిపించుకోలేదు. ఇలా మూడుసార్లు బీజేపీ సీనియర్‌ నేతలు చెప్పిచూసినా ధన్‌ఖడ్‌ వైఖరిలో మార్పురాలేదని తెలుస్తోంది. 

మొదటిసారి నడ్డా, రిజిజు, రెండోసారి రిజిజు, మేఘ్వాల్, మూడోసారి మేఘ్వాల్‌ ఒక్కరే ధన్‌ఖడ్‌ను కలిసి ఎన్‌డీఏ కూటమి ఎంపీల సంతకాలు ఆ నోటీస్‌లో ఉండటం అత్యంత కీలకమని గుర్తుచేశారని, ధన్‌ఖడ్‌ అస్సలు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆ నోటీస్‌లోని విపక్ష ఎంపీల పేర్లు మాత్రమే రాజ్యసభాముఖంగా చదివుతానని కరాఖండీగా చెప్పారు. ఆదివారం కలిసిన అదే సీనియర్‌ కాంగ్రెస్‌ నేతను ఈ వివాదం తర్వాత సోమవారం సాయంత్రం సైతం ధన్‌ఖడ్‌ కలిసినట్లు తెలుస్తోంది. వీహెచ్‌పీ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్‌ హైకోర్టు జడ్జి శేఖర్‌ యాదవ్‌ అభిశంసననూ తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ధన్‌ఖడ్‌ మాట ఇచి్చనట్లు తెలుస్తోంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)