Breaking News

వరల్డ్‌ క్లాస్‌ లుక్‌లో గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌

Published on Sun, 07/14/2024 - 08:09

గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ త్వరలో వరల్డ్‌ క్లాస్‌ లుక్‌లో కనిపించనుంది. ఈ  రైల్వే స్టేషన్‌ను రూ.498 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్‌లో పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నామని నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు, రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సౌకర్యాలు  ఏర్పాటు చేయనున్నామన్నారు. బడ్జెట్ హోటల్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా ఇక్కడకు వచ్చి సినిమాలు చూసేందుకు, షాపింగ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.

గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రావెలేటర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇది ప్రత్యేక తరహా ఎస్కలేటర్. దానిపై నిలబడి నడవకుండానే ఒక చోట నుంచి మరో చోటికి చేరుకోవచ్చు. సీనియర్ సిటిజన్‌లు, మహిళలు, వికలాంగులతో సహా ప్రయాణికులంతా ట్రావెలేటర్‌ను వినియోగించుకోవచ్చు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోరఖ్‌పూర్‌ రైల్వే ‍స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. 2023 జూలై 7న ప్రధాని నరేంద్ర మోదీ ఈ  రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)