Breaking News

అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య

Published on Thu, 12/25/2025 - 05:21

యశ్వంతపుర : అయోధ్యలోని రామాలయానికి బంగారు రామయ్య విగ్రహాన్ని ఓ భక్తురాలు విరాళంగా అందించారు. రూ.30 కోట్ల విలువ చేసే 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కూడిన బంగారు, వజ్రాలతో కూడిన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని బెంగళూరు రాజాజీనగర్‌కు చెందిన కళాకారిణి జయశ్రీ ఫణీశ్‌ స్వయంగా రూపొందించి అందజేశారు. పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో విగ్రహాన్ని తీర్చిదిద్ది... విలువైన మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు, కెంపులతో అలంకరించారు. 

తంజావూరు చిత్రకళ శైలిలో, బాలరాముని మూలవిరాట్టు పోలికలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శ్రీరాముని విగ్రహంలోనే హనుమాన్, గరుడ, దశావతార చిత్రాలున్నాయి. పెద్ద విల్లు, బాణాలు పట్టుకుని ఉన్న రామయ్య విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలోనే ప్రతిష్టించాలని రామజన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించారు. 

జయశ్రీ ఫణీశ్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులు విగ్రహ ఖర్చును భరించినట్లు తెలిసింది. విగ్రహాన్ని నాణ్యమైన ఎర్రచందనం చెక్క పెట్టెలో ఆలయానికి మంగళవారం తీసుకెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణ రామయ్యకు ఆలయంలో విశేష పూజలు చేశారు.

Videos

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)