Breaking News

బస్సులో మహిళపై చిల్లర పడేసి, గొలుసు చోరీ

Published on Wed, 03/11/2026 - 07:53

కర్ణాటక: మైసూరులో రెండుచోట్ల మహిళల బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. వివరాలు.. వృద్ధురాలి మెడలోని 40 గ్రాముల గొలుసు చోరీ చేసిన ఘటన ఎన్‌ఆర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. నీలమ్మ (60) అనే మహిళ బెళ్లూరు క్రాస్‌ నుంచి మైసూరుకు వచ్చే బస్సులో ప్రయాణిస్తుండగా ఇద్దరు అపరిచిత మహిళలు శిశువుతో సహా శ్రీరంగపట్టణలో బస్సు ఎక్కారు. శిశువు వాంతులు చేసుకుంటోంది, కిటికీ పక్కన స్థలం ఇవ్వాలని నీలమ్మను అడిగితే తిరస్కరించింది.

 కొలంబియా ఆస్పత్రి వద్దకు బస్సు చేరుకోగానే మహిళలు బస్సు దిగబోతూ తమ లగేజీని తీస్తూ నీలమ్మపైకి చిల్లరను పడేశారు. చిల్లరను తీసిచ్చేందుకు నీలమ్మ వంగినప్పుడు ఆమె మెడలోని బంగారు గొలుసును కట్‌ చేసుకున్నారు. ఎల్‌ఐసీ స్టాప్‌ రాగానే మహిళలు బస్సు దిగి వెళ్లిపోయారు. నీలమ్మ ఇంటికి వెళ్లిన తరువాత చూసుకుంటే గొలుసు లేదు. చిల్లర డబ్బులు వంటిపై పడినప్పుడు ఏదో మైకం కమ్మినట్లయిందని నీలమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.   

టీవీ చూస్తుండగా చొరబడి...  
మైసూరు చామరాజ మొహల్లా నివాసి ఇంద్రాణి సోమవారం రాత్రి 9.45 గంటల సమయంలో గాలి రావడం లేదని ఇంటి తలుపును తెరిచి ఉంచి టీవీ చూస్తోంది. ఆ సమయంలో దుండగుడు చొరబడి ఇంద్రాణి ముఖం, కళ్లపై స్ప్రే చేసి ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఆమె లక్ష్మీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  

#

Tags : 1

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)