Breaking News

Nashik: ఉప్పొంగిన గోదావరి.. నీట మునిగిన ఆలయాలు

Published on Mon, 08/26/2024 - 10:05

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక  అధికారులు విజ్ఞప్తి చేశారు.

నాసిక్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం ఎనిమిదిన్నర వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. ఫలితంగా రాంకుండ్‌ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.

గంగాపూర్ డ్యాం సహా పలు డ్యాంల నుంచి అధికారులు క్రమంగా నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్‌లోని హోల్కర్ వంతెన కింద నుంచి 13,000 క్యూసెక్కుల వేగంతో నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్ పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, నది ఒడ్డున ఉన్న గ్రామాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు హెచ్చరించారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)