Breaking News

వాళ్లకు ఉచిత వైద్యం అందించాల్సిందే: ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు

Published on Tue, 12/24/2024 - 16:57

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.  అత్యాచారం, యాసిడ్ దాడులు, లైంగిక దాడులు, పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) కేసుల బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందేందుకు అర్హులని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించారు. 

మంగళవారం తండ్రి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ దాఖలైన పోక్స్‌ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. 

అత్యాచారం, యాసిడ్ దాడి బాధితులకు ఉచిత వైద్యం అందించాలని, అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు నర్సింగ్‌హోమ్‌లు తప్పని సరిగా ఈ ఆదేశాలను పాటించాలని జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్ జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అలాగే పోక్సో సంబంధిత కేసుల్లో.. బాధితులకు తక్షణ వైద్య సంరక్షణ, అవసరమైన సేవలు అందించాలని సూచించింది.

బాధితులకు అందించే ఉచిత వైద్యంలో ప్రథమ చికిత్స, రోగ నిర్ధారణ, ఇన్‌పేషెంట్ కేర్, ఔట్ పేషెంట్ ఫాలో అప్‌లు, రోగనిర్ధారణ, సంబంధిత పరీక్షలు, అవసరమైతే శస్త్రచికిత్సలు, ఫిజకల్,మెంటల్‌ కౌన్సెలింగ్,ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సైతం వస్తాయని కోర్టు స్పష్టం చేసింది.

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)